Popular Posts

Saturday, 22 October 2016

హై బీపీ , హై కొలెస్ట్రాల్ తగ్గించే ఆరంజ్ ప్లాక్స్ జ్యూస్


హై బీపీ , హై కొలెస్ట్రాల్ తగ్గించే ఆరంజ్ ప్లాక్స్ జ్యూస్

ఈ మధ్యకాలంలో హై బీపీ , హై కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడేవారి సంఖ్య పెరిగింది. క్రింది చెప్పిన జ్యూస్ తీసుకొని , డాక్టర్ చెప్పిన మందులు క్రమం తప్పకుండా వాడుకొంటే సమస్య నుండి తొందరగా బయటపడవచ్చు. 

1) ఒక గ్లాస్ ఆరంజ్ జ్యూస్ లో ఒక అరస్పూన్ అవిసెగింజల పొడి (ప్లాక్స్ సీడ్ పొడి) కలిపి ఉదయం పరగడుపున అలాగే సాయంత్రం పరగడుపున తీసుకొంటే ఒక నెలలో సమస్య నుండి బయట పడవచ్చు. 

2) అలాగే ఆహారంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి .. వాటర్ ఎక్కువగా త్రాగుతూ తాజా కూరగాయలు , ఆకుకూరలు , పండ్లు తీసుకోవాలి. 

3) వేపుళ్ళు , నూనె ఎక్కువ ఉండే పదార్ధాలు , కొవ్వు ఎక్కువ ఉన్న ఆహారాలకు దూరంగా ఉండాలి. లేదంటే గుండెజబ్బు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. 

 4) ప్రతి 3 నెలలకు ఒక సారి సమస్య తగ్గేవరకూ డాక్టర్ దగ్గరికి వెళ్తూ తగిన మందులు వాడుకోవాలి.  

మొటిమలు , మచ్చలు తగ్గించే మింట్ ఫేస్ ప్యాక్!


మొటిమలు , మచ్చలు తగ్గించే మింట్ ఫేస్ ప్యాక్!

1) ఒక కప్పు పుదీనా ఆకులను , ఒక టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ మిక్స్ చేసి  గ్రైండ్ చేసి మెత్తగా పేస్టు చేసుకోవాలి. 

2) ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి , మెడకు మందంగా ప్యాక్ వేసుకోవాలి. 

3) అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి. 

4) ఇలా ప్రతి రోజు క్రమం తప్పకుండా చేస్తే మొటిమలు , మచ్చలు తగ్గుతాయి. 

5) మొటిమలు తో బాధపడేవారు బయటి జంక్ ఫుడ్ , ఫ్యాట్  ఫుడ్ తగ్గించాలి. వాటర్ ఎక్కువగా త్రాగుతూ ఉండాలి.  

Thursday, 20 October 2016

బ్రేక్ఫాస్ట్ లో ఓట్స్ తీసుకొంటే ఆరోగ్యం పదిలం!

బ్రేక్ఫాస్ట్ లో ఓట్స్ తీసుకొంటే ఆరోగ్యం పదిలం!

1.ఓట్ మీల్ ను తీసుకోవడం వల్ల రోజులో మిగతా భాగం ఆహారం తక్కువగా తీసుకోవడంతో పాటు బరువు కూడా తగ్గుతారు.

2.దీనిలోని ఫైబర్ మలబద్దకాన్ని తగ్గించడమే కాకుండా షుగర్ లెవల్స్ కంట్రోల్ లో ఉంచుతుంది.

3.దీనిలోని పోషకాలు మానవ శరీరం నిర్మానికి పూర్తి స్థాయిలో ఉపయోగపడతాయి.

4.డయాబెటిస్ ను కంట్రోల్ లో వుంచుతుంది.

5.లో క్యాలరీలను,ఇచ్చి మీ డైట్ ను అదుపులో వుంచుతుంది.

6.గుండె వ్యాధి, హార్ట్ ప్రాబ్లమ్స్ ను దూరం చేయడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

7.దీనిలోని యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలోని ఫ్రీ రాడికల్స్ ను తగ్గించి క్యాన్సర్ వచ్చే చాన్స్ లను తగ్గిస్తుంది.

Tuesday, 18 October 2016

జుట్టు పెరుగుదలకు చిట్కాలు

జుట్టు పెరుగుదలకు చిట్కాలు

1) ఈ మధ్య చిన్న పెద్ద తేడా లేకుండా అందరికి ఉండే సమస్య జుట్టు రాలటం. 

2) దీనికి ఒక్కటే మార్గం ఆహారంలో కూరగాయలు , తాజాపండ్లు , ఆకుకూరలు ఎక్కువగా తీసుకొంటూ ఉండాలి. మాంసాహారంలో గుడ్లు , పాలు , చేపలు ఎక్కువగా తీసుకోవాలి. 

3) బాదం ఆయిల్ జుట్టు ఆరోగ్యంగా పెరిగేలా చేస్తుంది. రాత్రి నిద్రపోయే ముందు కొంచెం బాదాం ఆయిల్ గోరువెచ్చగా చేసి జుట్టు కుదుళ్ళు మరియు తలమొత్తం ఒక 3 నిముషాలు మసాజ్ చేసుకోవాలి. 

4) ఒత్తిడి , ఆందోళన వల్ల కూడా జుట్టు రాలిపోతుంది. కాబట్టి మానసిక ప్రశాంతత కోసం యోగ సాధన చేయాలి.
 

పరగడుపున నీళ్లు త్రాగడం వల్ల కలిగే ప్రయోజనాలు


 పరగడుపున నీళ్లు త్రాగడం వల్ల కలిగే ప్రయోజనాలు

ఉదయాన నిద్రలేవగానే పరగడుపున గ్లాసు నీళ్లు తాగితే ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి. ఆ విశేషాలు ఇవి.

1. పరగడుపున నీళ్లు తాగితే పేగుల్లో కదలికలు పెరుగుతాయి. రాత్రివేళ శరీరం టాక్సిన్స్‌ అన్నింటిని సేకరిస్తుంది. ఉదయాన నీళ్లు తాగగానే ఆ టాక్సిన్స్‌ అన్నీ బయటకు వెళ్లిపోతాయి. నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల కండర కణజాలం, కొత్త రక్తకణాలు ఉత్పత్తి బాగా జరుగుతుంది.

2. ఖాళీ కడుపున నీళ్లు తాగడం వల్ల కనీసం మెటబాలిక్‌ రేటు 24 శాతం వరకు పెరుగుతుంది. కఠినమైన ఆహార నియమాలు పాటించేవారికి ఇది చాలా ఉపయోగకరం.

3. అజీర్తి సమస్యకు కారణం పొట్టలో ఎసిడిటీ పెరిగిపోవడమే. గుండెలో మంటకు కూడా యాసిడ్‌ రిఫ్లక్స్‌ కారణమవుతుంది. పరగడపున నీళ్లు తాగితే యాసిడ్‌ డైల్యూట్‌ అయి సమస్య చాలా వరకు తగ్గిపోతుంది.

Saturday, 15 October 2016

శరీరంలో టాక్సిన్స్ (విషపదార్ధాలు) తొలగించే కొత్తిమీర జ్యూస్

శరీరంలో టాక్సిన్స్ (విషపదార్ధాలు) తొలగించే 
కొత్తిమీర జ్యూస్

1) కొత్తిమీర లో ఉండే ఔషధ గుణాలు శరీరంలో టాక్సిన్స్ బయటికి పంపించడంలో సహాయపడతాయి. 

2) ఈ జ్యూస్ దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడేవారికి మేలు చేస్తుంది.

3) ఉదయం పరగడుపున లేదా సాయంత్రం పరగడుపున తీసుకొని అరగంట ఏమీ తినకూడదు. 

తయారీ విధానం :
1)  ముందుగా కొత్తిమీర కట్టను శుభ్రంగా కడిగి కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిని మిక్సీ లో వేసి దానిలో అరచెక్క నిమ్మరసం , ఒక గ్లాస్ వాటర్ , ఒక పావు స్పూన్ ఉప్పు వేసి బాగా గ్రైండ్ చేయాలి. 

2) ఇప్పుడు దీనిని వడపోయకుండా అలాగే గ్లాస్ లో తీసుకొని సర్వ్ చేసుకోవాలి. 

3) ఇది ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది. ప్రతి ఒక్కరు తీసుకోవచ్చు. స్త్రీల ఆరోగ్యానికి కొత్తిమీర బాగా ఉపయోగపడుతుంది.

 

Friday, 14 October 2016

చర్మ సౌందర్యం మెరుగుపరిచే కలబంద కాంబినేషన్ పేస్ ఫ్యాక్స్

చర్మ సౌందర్యం మెరుగుపరిచే కలబంద కాంబినేషన్ పేస్ ఫ్యాక్స్ 
1.పసుపు, దీనిని కలబంద పేస్ట్ లో కలుపుకోని రాసుకుంటే ముఖం పై వున్న మొటిమలు పోతాయి. అలాగే చర్మపు ఇన్ఫెక్షన్లను కూడా దూరం చేస్తుంది.

2.కీరదోసకాయ రసం లేదా నిమ్మరసం, దీనిని కలబంద పేస్ట్ లో కలుపుకోని ప్యాక్ కింద వేసుకుంటే చర్మానికి కావాల్సిన హైడ్రేషన్ అందుతుంది. దీని వల్ల చర్మం స్మూత్ , అందంగా తయారవుతుంది.

3.టమోటా జ్యూస్, దీనిని కలబందలో కలుపుకోని ఫేస్ ప్యాక్ కింద వేసుకుంటే విటమిన్ సి, ఇ లు బాగా అంది చర్మం హెల్తీగా, కాంతివంతంగా కనబడుతుంది.

4.బియ్యం పిండి, దీనిని కలబందలో మిక్స్ చేసి రాసుకుంటే చర్మం పై డెడ్ సెల్స్ పోతాయి.

5.బాగా పండిన అరపండు గుజ్జు, దీనిలో కలబంద పేస్టును కలిపి ప్యాక్ గా వేసుకుంటే చర్మం బిగుతుగా మారుతుంది. అంటె సాగే గుణాన్ని ( ముడతలు రావడాన్ని) తగ్గిస్తుంది.

6.క్యారెట్ జ్యూస్, దీనిని అలోవెర జెల్ లో కలుపుకోని ముఖానికి రాసుకుంటే ముడతలు పోయి శరీరం కాంతివంతంగా తయారవుతుంది.

Thursday, 13 October 2016

డయాబెటిస్(షుగర్) నియంత్రించే మెంతులు - పెరుగు కాంబినేషన్!

డయాబెటిస్(షుగర్) నియంత్రించే 
మెంతులు - పెరుగు కాంబినేషన్!

ప్రస్తుత రోజులల్లో చిన్న పెద్ద తేడా లేకుండా అందరికిని భయపెడుతున్న వ్యాధి డయాబెటిస్. 
దీనికి ముఖ్యకారణం 
1) విచ్చలవిడి ఆహార శైలి మరియు జీవన శైలి!
2) శారీరక వ్యాయామం లేకపోవడం
3) నిద్రలేమి 
4) వంశ పారంపర్యం

డాక్టర్ లేదా డైటీషియన్ సూచించిన మందులు వాడుకొంటూ ఆహారంలో తగిన జ్రాగత్తలు తీసుకోవాలి. సహజంగా డయాబెటిస్ ను ఎదుర్కోవడంలో ప్రముఖపాత్ర వహిస్తాయి. 

1) ఒక స్పూన్ మెంతి పొడిని , ఒక కప్ పెరుగు లేదా ఒక గ్లాస్ మజ్జిగలో ప్రతిరోజు తీసుకోవడం ద్వారా డయాబెటిస్ ను అదుపులో పెట్టుకోవచ్చు. 

2) ఇన్సులిన్ తీసుకొంటున్నవారు రెండు పూటలా తీసుకొంటే అదుపులోకి వచ్చేస్తుంది. ఆకుకూరలు ఎక్కువగా తీసుకొంటూ ఉండాలి.


స్మోకింగ్ చేసేవారికి కాన్సర్ రాకుండా కాపాడే ఆహారాలు!

స్మోకింగ్ చేసేవారికి కాన్సర్ రాకుండా కాపాడే ఆహారాలు!

క్రమ క్రమంగా స్మోకింగ్ అలవాటును తగ్గించుకొంటూ క్రింది ఆహారాలను 
డైట్  లో చేర్చుకోవాలి!

ప్రస్తుతం వున్న కాలంలో చాలా మంది కి ఒక అలవాటు తయారయ్యంది ధూమాపానం. అదేనండీ సిగరెట్, బీడీలు తాగడం.దీని మీద గవర్నమెంట్లు, ఎన్.జీ.ఓ లు ఎన్ని సార్లు యాంటీగా ప్రచారం చేసిన వీరు మాత్రం తాగడం మానటం లేదు.కొంత మంది మానేద్దాం అని చూస్తారు అయిన చాలా కష్టపడతారు మానేయడానికి కారణం దీనిలో వుండే నికోటిన్.దీనికి మనిషి అలవాటు పడ్డాడు అంటే ఇక వాళ్ళను బయటపడేయడం చాలా కష్టం. సో అలాంటి వారికి వారి శరీరం నుంచి నికోటిన్ తీసేసి లంగ్ క్యాన్సర్, ఇన్ఫెక్షన్ల నుండి దూరం చేసే కోన్ని ఆహారపదార్దాలను ఒక సారి చూద్దాం. 

1. క్యారెట్ జ్యూస్, దీని జ్యూస్ రోజు తీసుకోవడం వల్ల శరీరంలోని నికోటిన్ ను బయటకు పంపించేస్తుంది.

2.కివి ఫ్రూట్స్, దీనిలోని విటమిన్స్ శరీరంలో టాక్సిన్ పదార్దాలను బయటకు పంపించేస్తుంది. ఆ క్రమంలోనే నికోటిన్ కూడా బయటకు పంపించేస్తుంది.

3.వాటర్, శరీరంలోని చాలా రోగాలకు వాటరే బెటర్ సొల్యూషన్.వాటర్ ను ఎక్కువగా తాగడం వల్ల లంగ్ ను డీహైడ్రేషన్ నుంచి కాపాడవచ్చు.

4.ఉల్లిపాయలు, దీనిలోని కంటెంట్ శరీరంలోని టాక్సిన్ ను దూరం చేస్తుంది.

5.పసుపు మరియు అల్లం, వీటిలోని యాంటీ టాక్సిన్ గుణాలు శరీరంలోని విషపదార్దాలతో పాటు, నికోటిన్ ను కూడా తీసేస్తుంది.

6.ఆరెంజెస్, ఆపిల్స్ లోని విటమిన్స్ శరీరంలో నికోటిన్ ను తీసివేయడమే కాకుండా శ్వాస సంబంధిత వ్యాధులను నుండి దూరం చేస్తుంది.
 

Wednesday, 12 October 2016

కిడ్నీలో రాళ్లను & గాల్ బ్లాడర్ రాళ్లను కరిగించే న్యాచురల్ డ్రింక్

కిడ్నీలో రాళ్లను & గాల్ బ్లాడర్ రాళ్లను కరిగించే న్యాచురల్ డ్రింక్
కావాల్సిన పదార్ధాలు :
1) ఒక గ్లాస్ గోరువెచ్చని వాటర్ 
2) తులసి ఆకుల పేస్ట్ - 1 స్పూన్ 
3) నిమ్మరసం - అర  చెక్క 
4) తేనే - 1స్పూన్ 


తయారీ విధానం :
1) పైన పేర్కొన్న నాలుగు పదార్ధాలను కలిపి డ్రింక్ తయారు చేసుకోవాలి. 
దీనిని ఉదయం పరగడుపున , సాయంత్రం పరగడుపున తీసుకొని అరగంట వరకు ఏమీ తినకూడదు. నెల నుండి 3 నెలల వరకు క్రమంగా త్రాగాలి. 

2) ఆహారంలో ఎక్కువ కొవ్వు ఉన్న పదార్ధాలు , నూనె వస్తువులు తగ్గించాలి. డాక్టర్  లేదా డైటీషియన్ సలహా మేరకు మందులు వాడుకొని , ఎక్కువ మొత్తంలో వాటర్ త్రాగుతూ ఉండాలి.  

3) తరచుగా స్టోన్స్ ఏర్పడేవారు కిడ్నీ స్పెషలిస్ట్ డాక్టర్స్ ని కలిసి సంబంధిత కోర్స్ వాడుకోవాలి. అశ్రద్ధ చేస్తే కిడ్నీలు పాడయ్యే అవకాశం ఉంది.